రాష్ట్రంలో పులులు, చిరుత పులుల సంచారం పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మృగాలు జనావాసంలోకి వస్తున్నాయి. తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ మహిళపై పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. పులి దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. జిల్లాలోని కాగజ్ నగర్ మండల పరిధిలోని బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కూలీకి వెళ్లింది.
పత్తి చేనులో పత్తి ఏరుతుండగా.. పులి వెనక నుంచి అకస్మాత్తుగా దాడి చేసింది. ఊహించని పరిణామం యువతి పులిని ప్రతి ఘటించలేక పోయింది. దీంతో పులి మహిళ మెడ భాగంలో తీవ్రంగా దాడి చేసింది. గమనించిన మిగతా కూలీలు కేకలు వేశారు. పులి అక్కడి నుంచి పారిపోయింది. మిగతా కూలీలు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి ఆస్పత్రికి వెళ్లేలోగ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆరో నంబర్ విలేజ్ లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పులి ఏటు వెళ్లిందో చెక్ చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు పులుల సంచారిస్తున్నాయి కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పులుల్లో ఒకటి మగ పులి జానీ కాగా మరో పులి ఆడ పులిగా గుర్తించారు. మగ పులి తాజాగా మహారాష్ట్రకు వెళ్లిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. రెండో పులి జాడ కోసం వెతుకుతున్న క్రమంలో పులి దాడి విషయం బయటకు వచ్చింది.
ఆ పులి లక్ష్మిపై దాడి చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం పులి దృశ్యాలను వాహనదారులు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. పులి కదిలికలు తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన అధికారులు సూచిస్తున్నారు.
Related Posts
Viral
రేవంత్ కు చిరంజీవి ఫోన్, భేటీకి దూరం - అసలు కారణం..!!
26, Dec 202418 Views
Viral
Celebrities meet CM Revanth Reddy Live: సీఎంతో సినీప్రముఖుల భేటీ..
26, Dec 202414 Views
Viral
Allu Arjun Police Inquiry: సంధ్య థియేటర్ కేసులో మరో కీలక పరిణామం.. దానిపైనే పోలీసుల ఫోకస్..!
What service do you need? DGS Localneeds will help you
Your Enquiry Is Submitted Successfully!!!
Oops!! Something Went Wrong Try Later!!!
You cannot make enquiry on your own listing!!
List your business for FREE
Local Needs Free Listing feature provides a venue for showcasing a range of specialities. In addition to providing you with the information via phone, web and app, we also give you a platform to share your experiences with others via our Rate and Review function. We make sure that you are provided with the finest deals available through the Best Deals,Last Minute Deals and Live Quotes sections of our website.